JN: ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని దాన్ని కాపాడుకునే విధంగా వైద్య అధికారులు సేవాలాందించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. విద్యాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.