సత్యసాయి: పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ జయప్ప మాట్లాడుతూ.. నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోందని తెలిపారు. ప్రజలు ఆకలితో అలమటించడం విచారకరమన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ఆహార వృథాను అరికట్టి ఆకలి కేకలను ఆపాలని తెలిపారు.