కృష్ణా: పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం తాడిగడప మున్సిపాలిటీ, కానూరు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ప్రజా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.