SKLM: గారలోని వేణుగోపాలపురంలో చెత్త సేకరణ, ఐవీఆర్ఎస్ కాల్స్‌పై జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య గురువారం అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.