TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు.. దీపక్ రెడ్డికి బీఫామ్ అందించారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు.