TG: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫోన్ చేశారని, సుమారు 15 నిమిషాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో తనకు ఉన్న విభేదాల గురించి సురేఖ సీఎంకు వివరించారట. దీనిపై సీఎం స్పందిస్తూ.. త్వరలో అన్ని సమస్యలు సర్దుకుంటాయని ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫోన్ సంభాషణపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.