NRPT: నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. SI రాము వివరాల ప్రకారం.. మరికల్ మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన కోమటి రవి గృహంలో గురువారం విశ్వసనీయ సమాచారంతో దాడులు చేయగా రూ.30 వేల విలువైన గుట్కా ప్యాకెట్లును సీజ్ చేశారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.