TPT: నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వర పురానికి చెందిన శ్రీహరి (27) ప్రమాదవశాత్తు రేకుల షెడ్డుపై నుంచి జారిపడి మృతి చెందారు. శ్రీహరి చిల్లకూరు PS వద్ద సత్యంజి లేఅవుట్ సమీపంలో నిర్మిస్తున్నరేకులషెడ్డు వద్ద కూలీగా పని చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.