KMR: గాంధారి మండలంలో దారుణం జరిగింది. గాంధారి నుంచి చద్మల్ దారిలో గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవం పాక్షికంగా కాలిపోయింది. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తిని గుర్తిస్తే గాంధారి ఎస్సైకి తెలపాలన్నారు.