TG: సెక్రటేరియట్లో జరగాల్సిన కార్యక్రమాలు రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్‌లో ఎందుకు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. డెక్కన్ సిమెంట్‌కు.. సుమంత్‌కు ఏం సంబంధం అని విమర్శించారు. అసలు తల మీద తుపాకీ పెట్టి పంచాయితీలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.