AP: ప్రధాని మోదీ 25 ఏళ్లుగా దేశానికి అద్భుతంగా సేవలు అందిస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సరైన సమయంలో సరైన నాయకుడు దేశాన్ని నడిపిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు. మోదీ లాంటి గొప్ప నాయకుడిని నా జీవితంలో చూడలేదు. గేమ్ ఛేంజింగ్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మోదీది’ అని పేర్కొన్నారు.