VSP: విశాఖ తూర్పు నియోజకవర్గంలో మత్స్యకారులకు సబ్సిడీపై అవుట్ బోర్డు మోటార్ల పంపిణీ గురువారం జరిగింది. పెదజాలరిపేట గ్రామ మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 40 శాతం సబ్సిడీపై మూడు అవుట్ బోర్డు మోటార్లను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీపై రూ.11,320 సబ్సిడీ అందించిందని తెలిపారు.