AP: డబుల్ ఇంజిన్ సర్కార్‌తో డబుల్ బెనిఫిట్ అని CM చంద్రబాబు తెలిపారు. ‘మోదీ సాయంతో విశాఖకు ఆర్సెలార్ మిత్తల్, గూగుల్ ఏఐ డేటా సెంటర్, నెల్లూరుకు BPCL తీసుకొచ్చాం. సిమెంట్ పరిశ్రమలు కూడా సీమకు వస్తాయి. త్వరలోనే కర్నూలుకు హైకోర్ట్ బెంచ్. కడపకు స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ’ తీసుకొస్తామని శుభవార్త చెప్పారు.