CTR: చిత్తూరు నగరంలో హై రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులను కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు హైకోర్టు డౌన్ నుంచి సంతపేట లిల్లీ వంతెన వరకు రోడ్డును విస్తరణ, అభివృద్ధి పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా పనులను పరిశీలించారు.