VSP: కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజాపాలన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.