VSP: ఐసీడీఎస్ స్వర్ణోత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఏపీ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సుబ్బారావమ్మ ఆరోపించారు. విశాఖలో గురువారం జరిగిన అంగన్వాడీ జిల్లా సదస్సులో ఆమె మాట్లాడుతూ.. 1975లో ప్రారంభమైన ఐసీడీఎస్ వల్ల పేద మహిళలు, పిల్లల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.