కృష్ణా: గుడివాడ మండలం బైపాస్ రోడ్డులో ఎస్సై చంటిబాబు గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలను ఆపి పత్రాలు, లైసెన్స్లు, పరిశీలించారు. ప్రజల భద్రత, నేరాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఎస్సై చంటిబాబు తెలిపారు. వాహనదారులు తప్పకుండా తమ వెంట సరైన ప్రత్రాలు, హెల్మెట్ ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.