కృష్ణా: పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం తాడిగడప మున్సిపాలిటీ కానూరు, యనమలకుదురు గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలను ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను పరిశీలించారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారి పరిస్థితులు, వీధి దీపాల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలు పరిశీలించారు.