ATP: కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న సభలో జిల్లా మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూర రెడ్డి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భారత జెండాలు చేతబట్టి ప్రజలకు అభివాదం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు భారీ ఉపశమనం కలిగిందని వారు పేర్కొన్నారు.