AP: కూటమి అధికారంలోకి వచ్చాక కుంభకోణాలు పెరిగాయని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. నకిలీ మద్యం, రేషన్ మాఫియా బయటపడిందని అన్నారు. వాటాల కుమ్ములాటలో స్కామ్‌లు బయటపడ్డాయని దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోందని తెలిపారు. దీనిపై పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ స్పందించాలని డిమాండ్ చేశారు.