NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక 30, 31వ డివిజన్లు పొదలకూరు రోడ్డు, కొత్తూరు ప్రాంతాలలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన ఇండ్లు, దుకాణాలను గురువారం తొలగించారు. అనుమతులు లేని నిర్మాణాలు, డ్రైను కాలువలు, రోడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటుచేసిన ఇండ్లు, దుకాణాలను తప్పనిసరిగా తొలగిస్తామన్నారు.