MBNR: భారతదేశాన్ని క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా క్షయను నిర్మూలించొచ్చు అన్నారు. ఈ విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.