పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని, డైనింగ్ హాల్ పెయింటింగ్ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.