AP: ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో TDP కార్యకర్త మృతి చెందడంపట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TDP జెండాతో బైకుపై వస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అర్జున్ మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలను శాఖాపరంగా, పార్టీపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.