AKP: కోటవురట్ల మండలంలో ఈనెల 18న హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా రూ.73 లక్షలతో చేపట్టే లింగాపురం రోడ్డు, రూ.1.45 కోట్లతో నిర్మించే ఎండపల్లి-వేములపూడి రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శిలాఫలకాలు ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు.