SRD: ఎవరైనా స్పృహ లేకుండా పడిపోతే, శ్వాస లేదా నాడి పనిచేయనప్పుడు CPR ప్రారంభించాలని 108 DPM షాహిద్ అన్నారు. ఇవాళ కంగ్టి హైస్కూల్లో అవగాహన కల్పించారు. గుండె కొట్టుకోవడం ఆగిపోతే శరీరంలోని రక్తప్రసరణ నిలిచిపోతుందని, మెదడుకు ఆక్సిజన్ అందక కణాలు చనిపోతాయని, ఆ సమయంలో CPR చేస్తే కృత్రిమంగా రక్తప్రసరణ కొనసాగుతుందన్నారు. EMT సంగ్ శెట్టి, పండరి తదితరులు ఉన్నారు.