SKLM: జలుమూరు మండల కేంద్రంలో నిర్మించిన బస్సు షల్టర్ నిరుపయోగంగా మారిందని సామాజిక కార్యకర్త నాయుడు గారి రాజశేఖర్ గురువారం తెలిపారు. నిర్వహణ లోపంతో బస్సు షెల్టర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి పాముల సంచారం అధికమైందని వాపోయారు. జలుమూరు ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పరిశీలించి బస్సు షెల్టర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు.