TG: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమంత్ పొల్యూషన్ బోర్డులో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమయ్యాడు. డిప్యూటేషన్ మీద కొండా సురేఖ ఓఎస్డీగా చేరాడు. ఈ ఏడాది డిసెంబర్లో డిప్యూటేషన్ ముగుస్తుంది. మళ్లీ డిప్యూటేషన్ పొడిగింపునకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఈలోపే సుమంత్‌ను టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.