బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం JDU మరో 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ మొత్తం 101 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ 57 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తాజా 44 మంది పేర్లతో మొత్తం అభ్యర్థుల సంఖ్య 101కి చేరింది. ఈ జాబితాల ద్వారా జేడీయూ తన బలాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.