AP: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి సంత్రగాచి ట్రైన్ మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పెదకూరపాడు సమీపంలో దిగిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు CC ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం అతణ్ని తెనాలిలో అదుపులోకి తీసుకున్నారు.