VSP: బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళిని పురస్కరించుకుని మహిళలకు ఉచితంగా కొవ్వొత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 18న శనివారం ఉదయం 10:30 గంటలకు ఫిషింగ్ హార్బర్ బీచ్ రోడ్లోని ఫౌండేషన్ బ్రిడ్జ్ స్కూల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం బీచ్ రోడ్లోని కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.