E.G: రాజమండ్రిలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్ పర్సన్ గంధం సునీత బుధవారం అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, చార్జీషీట్ల దాఖలు అంశాలపై పోలీసు అధికారులతో చర్చించారు.