SRD: ఓ మహిళా సూసైడ్ చేసుకున్న ఘటన సిర్గాపూర్ మండలం తోల్య తండాలో చోటుచేసుకుంది. మండలంలోని రాజేశ్వర్ తాండకు చెందిన జీజాబాయి(48) తోల్య తండాలో తన కూతురు అర్చన వద్దనే ఉంటుంది. అయితే తరచూ అల్లుడు శంకర్ తప్ప తాగి గొడవ పడి, అత్త డబ్బులు దుబారా ఖర్చు చేయడంపై గొడవముదిరింది. మనస్థాపం చెందిన ఆమె చెట్టుకు ఉరేసుకొని మృతి చెందిందని ఎస్సై మహేష్ తెలిపారు.