ఉత్తరాఖండ్‌లోని 2 జిల్లాల్లో 15 రోజుల్లో అంతుచిక్కని జ్వరంతో 10 మంది మరణించడంతో భయాందోళనలు రేకెత్తాయి. మృతుల్లో జ్వరం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయి. పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడంపై స్థానికుల అభ్యంతరంతో అధికారులు బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చాకే మరణాలకు కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు.