BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోతగల్లు వాగు నుంచి బుధవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. SI అశోక్ తెలిపిన వివరాల ప్రకారం, బద్దంపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు అక్రమ రవాణాకు పాల్పడగా, నమ్మదగిన సమాచారంతో పోలీసులు వాటిని పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశారు.