BHNG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఐద్వా భువనగిరి మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న కాలంలో మండల వ్యాప్తంగా గ్రామస్థాయిలో మహిళల సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం గ్రామ కమిటీల నిర్మాణం ద్వారా ఉద్యమాలు, పోరాటాలు చేపడతామని తెలిపారు.