NZB: నిజామాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వెనుక నుంచి వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, గాయపడిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.