మన్యం: జిల్లాలో మరో జలపాతం అందుబాటులోకి రానుంది. గుమ్మలక్ష్మీపురం మండలం మొగనాలి (తాడికొండ) వద్ద జలపాతాన్ని పర్యాటకుల సందర్శన కొరకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. జలపాతం వరకు బస్సు సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ జలపాతం పర్యాటకుల్ని ఆకట్టుకుంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.