జనగామలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలురకు 5, 9వ తరగతులు, బాలికలకు 5, 6, 7, 9వ తరగతుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు అక్టోబర్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.