KMM: ఎర్రుపాలెం మండలం ములుగుమాడుకి చెందిన స్నేహితులు ఆముదాల రాము, షేక్ జానీ ఆర్థిక సమస్యల కారణంగా బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాము పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. జానీకి మధిరలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.