BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మ పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ కీలకమని, కేంద్రాల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.