VSP: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సంస్థ చెల్లించాల్సిన సుమారు రూ. 2,400 కోట్ల విద్యుత్ బకాయిలను షేర్ కేపిటల్గా మార్చేందుకు ఏపీ సర్కార్ బుధవారం అంగీకరించింది. ఉక్కు మంత్రిత్వశాఖ చేసిన ఈ కీలక ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.