NLG: నల్గొండలోని ఐటీఐ క్యాంపస్లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. జిల్లాలో పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ (అన్ని ట్రేడ్ల)లో ఉత్తీర్ణత పొందిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.