NLG: తిప్పర్తి మండలం రాజుపేటలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. వీధుల్లో తిరుగుతున్న కుక్కలు పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి, ఈ సమస్యను అరి కట్టడానికి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.