VZM: రాజాం డిప్యూటీ MPDO శ్రీనివాసరావు గురువారం కంచరాం గ్రామంలో స్దానికులకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తడి, పొడిచెత్త వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాల్నీ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని, పర్యావరణ పరిరక్షణకు మహిళలు ముందుండాలని పిలుపునిచ్చారు.