కృష్ణా: గన్నవరం RTC బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు బాపులపాడు(M) కోడూరుపాడుకి చెందిన సుబ్బారావు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్‌గా స్థానికులు గుర్తించారు. కాగా, రైతు బజార్లో కూరగాయలు కొనుక్కొని బైకుపై ఇంటికి వెళుతున్న సుబ్బారావును లారీ ఢీకొనగా, తల ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.