BHPL: ఘనపూర్ మండలం అప్పయ్యపల్లె గ్రామంలో ఇవాళ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు. ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆపదల్లో పార్టీ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.