కృష్ణా: గుడ్లవల్లేరులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, వివిధ పంచాయతీలలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల అందుబాటులో మెరుగుదల, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ స్వచ్ఛత కార్యక్రమాలు, గ్రామ సచివాలయాల కార్యకలాపాలపై ఎంపీడీవో సమీక్షించారు.