కృష్ణా: గుడివాడ IMA, వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఐఎంఏ హాల్లో నిర్వహించే మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గుడివాడలోని ఆయన కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గుడివాడలో రక్త నిల్వలు పెంపొందించేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసామన్నారు.