GNTR: బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వాక్సినేషన్ అవసరమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ఇవాళ నగరంలోని విజ్ఞాన్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేస్తుందని పేర్కొన్నారు.